AP EAPCET 2026 Results : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి. రాష్ట్ర విద్యా, సమాచార సాంకేతిక (IT) శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. కానీ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు. ఈఏపీసెట్ జులై 2వ తేదీన విడదల చేయనున్నారు.
AP EAPCET ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి?

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందొచ్చు.
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. హాయ్ అనే మేసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.
ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ర్యాంకుల విడుదల తర్వాత….. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ఏపీ ఈఏపీసెట్ 2026 హాజరు గణాంకాలు:
ఏపీ ఈఏపీసెట్ - 2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తంగా 92.60 శాతం హాజరు నమోదైంది.
- ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్ష రాశారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు రికార్డయ్యింది.
- వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత….. సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. విడతల వారీగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే, వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుంది.
{{/usCountry}}ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత….. సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. విడతల వారీగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే, వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుంది.
{{/usCountry}}