...
...
Next Story

AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్‌ లింక్‌తో రిజల్ట్ చూసుకోండి

AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. డైరెక్ట్‌ లింక్‌తో ఇక్కడ నుంచి ఫలితాలను చూసుకోవచ్చు.

Published on: Jul 1, 2026, 15:02:39 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్(AP EAPCET) 2026 ఫలితాల విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేస్ ఎక్స్‌ వేదికంగా ఫలితాలను విడుదల చేశారు. నిజానికి జూన్ 30వ తేదీన ఫలితాలు రావాల్సి ఉంది. కానీ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు. ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిలై అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈఏపీసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉండటంతో ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా వేశారు. లైన్ క్లీయర్ కావడంతో ఫలితాలు విడుదల చేశారు.

AP EAPCET ఫలితాలను ఎలా చూసుకోవాలి?

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందొచ్చు.

అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.

అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.

సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా ఫలితాలను చూసుకోవచ్చు.

'ఇంజనీరింగ్‌లో 1,82,317 మంది అర్హత సాధించారు(70.52 శాతం). అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది అర్హత సాధించారు (89.59 శాతం). ఇంజనీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణత శాతంతో అమ్మాయిలు ముందంజలో నిలవడం గర్వకారణం.' అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. హాయ్ అనే మేసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.

ఏపీ ఈఏపీసెట్-2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,29,474 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా 92.60 శాతం హాజరు నమోదైంది.

ఈఏపీసెట్ 2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత.. సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. విడతల వారీగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe