ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్-2026 (AP EAPCET) ఫలితాల విడుదలకు తేదీ సిద్ధంగా ఉంది. దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ నెల 30న (మంగళవారం) ఉదయం విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సర్వం సిద్ధం చేసింది.

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్, ఎప్‌సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ ధృవీకరించారు. అయితే ఫలితాలు విడుదలయ్యే కచ్చితమైన సమయాన్ని (టైమింగ్స్) అధికారులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.
వాస్తవానికి ఈఏపీసెట్ షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఫలితాలు రావాల్సి ఉంది. కానీ నెల రోజులు ఆలస్యం కావడానికి బలమైన కారణం ఉంది. ఏపీ ఎప్‌సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు, అలాగే సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు ఫలితాల ప్రకటనను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ డేటా అంతా ఎక్సైజ్ కావడం, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ప్రక్రియ ముగియడంతో జూన్ 30న ఫైనల్ ర్యాంకులను విడుదల చేస్తున్నారు.
మే 12 నుండి మే 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగాయి. సుమారు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ + ఎప్‌సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఆధారంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులను కేటాయిస్తారు.
ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}ఫలితాల కోసం భక్తులు/విద్యార్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఫలితాల ప్రకటన అనంతరం జూలై మొదటి లేదా రెండో వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ (AP EAPCET Counselling 2026) ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.