...
...
Next Story

AP ECET 2026 Counselling : ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

AP ECET 2026 Final Phase Counselling : ఏపీ ఈసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 15న ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు.

Published on: Aug 8, 2026, 10:13:18 IST
Advertisement

AP ECET 2026 Final Phase Counselling : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ (మ్యాథ్స్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక అప్డేట్ అందించింది. ఏపీ ఈసెట్ - 2026 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వారితో పాటు బీఎస్సీ (గణితం) పూర్తి చేసి ఈసెట్ అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

APECET-2026 అడ్మిషన్ల ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల
APECET-2026 అడ్మిషన్ల ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం వంటివి పూర్తి చేసుకోవాలి. ఆన్‌లైన్ సర్టిఫికెట్ పరిశీలన తర్వాత… వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది.

ఏపీ ఈసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : 2026 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించనున్నారు.
  • సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన (HLCs) : ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 8 నుంచి ఆగస్టు 11 వరకు అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యతను నమోదు చేసుకోవచ్చు.
  • ఆప్షన్ల మార్పు : నమోదు చేసుకున్న ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి ఆగస్టు 12న అవకాశం కల్పించారు.
  • సీట్ల కేటాయింపు : ఆగస్టు 15న ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు.
  • కాలేజీలో రిపోర్టింగ్, సెల్ఫ్ జాయినింగ్ : సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 19 వరకు సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై సెల్ఫ్ జాయినింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • తరగతుల ప్రారంభం : ఆగస్టు 17 నుంచే అభ్యర్థులు కళాశాల తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.
  • కాలేజీ యాజమాన్యాలు ప్రవేశం పొందిన అభ్యర్థుల వివరాలను ఆగస్టు 19 నాటికి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe