AP ECET Hall Ticket : ఏపీ ఈసెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

AP ECET Hall Ticket 2026 Download :ఏపీ ఈసెట్ -2026 హాల్ టికెట్లు వచ్చేశాయ్. అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏప్రిల్ 23వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.

Published on: Apr 17, 2026, 07:59:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ (AP ECET-2026) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున ఈ ఏడాది జేఎన్‌టీయూ, అనంతపురం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఈసెట్ -2026 హాల్ టికెట్లు (istock image)
ఏపీ ఈసెట్ -2026 హాల్ టికెట్లు (istock image)

ఏపీ ఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23(గురువారం)వ తేదీన జరగనుంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగుతుంది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులతో పాటు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈ పరీక్ష అత్యంత కీలకం.

ఏపీ ఈసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/ECET లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ‘Download Hall Ticket’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ బటన్ నొక్కగానే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా కాలేజీ ఐడీ) తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో, సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే హెల్ప్ డెస్క్ అధికారులను సంప్రదించి సవరించుకోవాలి. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మే 7న ఈసెట్ ఫలితాలు…

ఏప్రిల్ 27వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 29 వరకు ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 7వ తేదీన ఏపీ ఈసెట్ - 2026 ఫలితాలను ప్రకటిస్తారు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగానే ర్యాంకులుంటాయి. మంచి ర్యాంకులు సాధించిన వారికి సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించి… సీట్లను భర్తీ చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More