TG ECET 2026 : టీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల - ఈనెల 9 నుంచి దరఖాస్తులు

టీజీ ఈసెట్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 9వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 15వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

Published on: Feb 1, 2026, 09:17:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్ వచ్చేసింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన వారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 9 నుంచి టీజీ ఈసెట్ 2026 దరఖాస్తులు
ఫిబ్రవరి 9 నుంచి టీజీ ఈసెట్ 2026 దరఖాస్తులు

ఈనెల 9 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు…

టీజీ ఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి షురూ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తుల ముందుగానే ప్రారంభం కానుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. ఇక ఇతర అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. మే 15వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్య ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఈసెట్ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. https://ecet.tgche.ac.in వెబ్ సైట్ లో వివరాలను చూడొచ్చు.

మరోవైపు ఈసారి దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచే అంశంపై నిర్ణయం తీసుకునే దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. దరఖాస్తుల విషయంలో కూడా విద్యార్థులు… చివరి తేదీల కోసం వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీనే టీజీ ఈసెట్ - 2026 పరీక్షను నిర్వహించనుంది. మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల సమయం ఇస్తారు. గణితం (50), భౌతికశాస్త్రం (25), రసాయన శాస్త్రం (25), ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉండగా… తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.

టీజీ ఈసెట్ - 2026 పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.అన్నింటిని క్రోడీకరించి తుది ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి ఈ ప్రాసెస్ ను పూర్తి చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శాలను విడుదల చేస్తారు. సీట్లు పొందే విద్యార్థులు సకాలంలో రిపోర్టింగ్ చేయకపోతే కూడా సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More