...
...
Next Story

AP ECET Results : ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ECET Download Rank Card 2026 : ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లోనూ చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Published on: May 8, 2026, 13:52:16 IST
Advertisement

AP ECET Download Rank Card 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ (APECET) 2026 ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) తరపున జేఎన్‌టీయూ అనంతపురం ఈ పరీక్షను గత నెల ఏప్రిల్ 23న విజయవంతంగా నిర్వహించింది. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించగా… ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఫలితాలను ప్రకటించారు.

ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు (istock image)
ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు (istock image)

ఈ ఏడాది పరీక్షకు మొత్తం 33,751 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా…. 32,434 మంది (96.09%) హాజరయ్యారు. వీరిలో 29,750 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అధికారులు వెల్లడించారు.

  • బాలురు: 21,704 మంది పరీక్ష రాయగా, 19,735 మంది అర్హత సాధించారు.
  • బాలికలు: 10,730 మంది పరీక్షకు హాజరుకాగా, 10,015 మంది విజయం సాధించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే…. అత్యధికంగా హైదరాబాద్ ప్రాంతం (రాష్ట్రం వెలుపల పరీక్షా కేంద్రం) నుంచి 97.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాష్ట్రంలోని జిల్లాల్లో కృష్ణా (95.43%), ఎన్టీఆర్ (92.10%), విశాఖపట్నం (93.30%) జిల్లాలు ఉత్తమ ఫలితాలను కనబరిచాయి.

ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో కనిపించే 'Results' లేదా 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఈసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
  4. వివరాలు సమర్పించిన తర్వాత మీ ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

ఏపీ ఈసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. ప్రాథమిక సమాచారం మేరకు… జూన్ లో ఈ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులు, హాల్ టికెట్లు మరియు విద్యార్హత ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అప్డేట్స్ కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు 2026 డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe