...
...
Next Story

AP ECET 2026 : ఏపీ ఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు - ఏప్రిల్‌ 23న ఎంట్రెన్స్ ఎగ్జామ్

ఏపీ ఈసెట్ - 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. మార్చి 12వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటించారు.

Published on: Mar 08, 2026 01:30 PM IST
Advertisement

ఏపీ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌)-2026కు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇఛ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండానే మార్చి 12వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఏపీ ఈసెట్ - 2026
ఏపీ ఈసెట్ - 2026

ఏపీ ఈసెట్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ-ఎ) నిర్వహిస్తోంది.

ఏపీ ఈసెట్ 2026 : దరఖాస్తు తేదీలు పొడిగింపు6,

కొత్త తేదీల ప్రకారం… లేట్ ఫీజు లేకుండా మార్చి 12వ తేదీ వరకు ఏపీ ఈసెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తులకు మార్చి 16, ఆలస్య రుసుము రూ.2000తో మార్చి 20 వరకు అవకాశం ఉంటుంది. ఇక లేట్ ఫీజు రూ.4000తో దరఖాస్తులకు చివరి తేదీని మార్చి 24గా నిర్ణయించారు. ఆలస్య రుసుము రూ.10,000తో మార్చి 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏప్రిల్ 23న ఎగ్జామ్…

మార్చి 28వ తేదీన ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 23వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 29 వరకు ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 7వ తేదీన ఏపీ ఈసెట్ - 2026 ఫలితాలను ప్రకటిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe