ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ (B.Ed) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందేందుకు సన్నాహాలు చేస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక సమాచారాన్ని అందించింది. బిఏడ్ (B.Ed / B.Ed Special Education) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ (AP EDCET) కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగుతుంది. వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 14ఈ నెల 18 వరకు ఉండనుంది. 19న ఆప్షన్లు మార్చుకోవచ్చు. సీట్ల కేటాయింపు 23న చేస్తారు. కాలేజీల్లో రిపోర్టింగ్ 24 నుంచి 28 మధ్య ఉంటుంది. తరగతుల ప్రారంభం 24వ తేదీ నుంచే ఉంటాయి.
కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో నిర్దేశించిన ప్రాసెసింగ్ ఫీజును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నెల 6 నుంచి 19 వరకు ఆన్‌లైన్ విధానంలోనే అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక కేటగిరీ (PH, NCC, Sports, CAP) అభ్యర్థులకు నిర్దేశిత హెల్ప్ లైన్ సెంటర్లలో ప్రత్యక్షంగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
అభ్యర్థుల ర్యాంకు, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 23న అడ్మిషన్ సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన పత్రాలను అభ్యర్థులు సిద్దం చేసుకోవాలి.
{{/usCountry}}అభ్యర్థుల ర్యాంకు, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 23న అడ్మిషన్ సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన పత్రాలను అభ్యర్థులు సిద్దం చేసుకోవాలి.
{{/usCountry}}AP EDCET హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, డిగ్రీ /పీజీ మార్కుల జాబితా, ప్రొవిజనల్ సర్టిఫికేట్, 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, 9వ తరగతి నుండి డిగ్రీ వరకు స్టడీ/బోనాఫైడ్ సర్టిఫికెట్లు కావాలి. నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(వర్తించే వారికి), టీసీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్‌ను అభ్యర్థులు సిద్ధం చేసుకోవాలి.
చివరి తేదీ వరకు వేచి చూడకుండా సాంకేతిక సమస్యలను అధిగమించడానికి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. మరింత పూర్తి సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.