...
...
Next Story

AP EdCET Results 2026 : ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల - రిజల్ట్ , ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

AP EdCET Results 2026 : ఏపీ ఎడ్‌సెట్ (AP EdCET-2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 99.30 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డలను వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 26, 2026 12:35 PM IST
Advertisement

AP EdCET Results 2026 : రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్ (AP EdCET-2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఎడ్‌సెట్ ఫలితాల్లో అభ్యర్థులు ఊహించని రీతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది.

ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల
ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

ఈ సంవత్సరం ఎడ్‌సెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా….. వారిలో ఏకంగా 19,741 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 99.30 శాతంగా నమోదైంది.

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EDCET ను సందర్శించండి.
  • హోం పేజీలో కనిపించే 'Results' లేదా 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • వివరాలు సమర్పించిన తర్వాత మీ ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

ఇక ఏపీ ఎడ్ సెట్ 2026 ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

  1. మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
  2. వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  3. వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
  4. ఆ తర్వాత "ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు 2026" పై క్లిక్ చేయండి.
  5. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఎడ్ సెట్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఎడ్ సెట్ ర్యాక్ కార్డు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe