ఏపీ ఫస్ట్ ఏర్పాటు.. పరిశోధనలు, ఆవిష్కరణలే లక్ష్యంగా సరికొత్త అడుగు!

రాష్ట్రంలో పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ-ఫస్ట్ అనే కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: Jun 29, 2026, 17:59:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యీకరించడాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ-ఫస్ట్(AP-FIRST - Andhra Pradesh Future Innovation, Research, Science & Technology) అనే కంపెనీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల చట్టం సెక్షన్-8 కింద లాభాపేక్ష లేని సంస్థగా దీనిని స్థాపించినట్లు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

ఈ నూతన సంస్థ భవిష్యత్తుకు అవసరమైన పలు కీలక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అండ్ సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, హెల్త్‌కేర్ అండ్ బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ వ్యవసాయ సాంకేతికతలు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్‌పై ఫోకస్ చేయనుంది.

రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల మౌలిక సదుపాయాలను ఈ సంస్థ ఉపయోగించుకోనుంది. ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలలో అందుబాటులో ఉన్న వసతుల ఆధారంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తుంది.

ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రభుత్వం రూ. 5 కోట్ల సీడ్ క్యాపిటల్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1 లక్ష కోట్ల 'రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్' వంటి పథకాలతో అనుసంధానమై, నిధుల సమీకరణలో స్వయం సమృద్ధి సాధించడమే 'ఏపీ-ఫస్ట్' ప్రధాన లక్ష్యం.

పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు, స్టార్టప్‌లు, ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఒక సమగ్ర ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రైవేట్, ప్రభుత్వ రంగానికి చెందిన పరిశోధనలను సమన్వయం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు కాంతిలాల్ దండే స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More