...
...
Next Story

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త - డీఏ ఇవ్వాలని నిర్ణయం, ఎప్పుడంటే..?

దీపావళి పండగ వేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 1 డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. నవంబరు 1 తేదీ నుంచి అమలయ్యేలా డీఏ చెల్లింపులు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

Published on: Oct 19, 2025, 02:07:06 IST
Advertisement

దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబరు 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీనికి ప్రతీ నెలా రూ.160 కోట్ల వ్యయం అవుతుందని సీఎం వెల్లడించారు.

ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు
ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు

ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ “పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం. ఈ ఏడాది నవంబరులో ఒక విడత, 2026 జనవరిలో మరో విడతను చెల్లిస్తాం. 1 సరెండర్ లీవ్ చెల్లింపుల నిమిత్తం రూ.210 కోట్లు వ్యయం అవుతుంది. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం” అని ప్రకటించారు.

“చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తాం. ఉద్యోగుల అందరి గౌరవాన్ని మరింత పెంచేలా కొన్ని నామన్ క్లేచర్లను రీ డెజిగ్నేట్ చేస్తాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

పీఆర్సీ విషయం నేను చూసుకుంటా - సీఎం చంద్రబాబు

" రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలుగ కూడదనే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. రాష్ట్రాభివృద్ధి యజ్ఞం చేస్తున్నాం. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎంతో భేటీకి ఏపీఎన్జీవో, ఏపీజేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks