AP Municipal Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల ముందస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.
ముగియనున్న పదవీకాలం…

రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు పూర్తయింది. మరో 13 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రాబోయే నవంబర్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గాల గడువు ముగిసిన చోట, త్వరలో ముగియనున్న చోట ఎలాంటి ఆలస్యం లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, సీట్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్లు తదితర ముందస్తు చర్యలన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
పాలకవర్గాలు లేకపోవడంతో పట్టణాల్లో స్థానిక పరిపాలనతో పాటు అభివృద్ధి పనులు మందగించకుండా చూసేందుకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తయిన వెంటనే ఎన్నికల సంఘం తుది షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేబినెట్ తాజాగానే నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ…. వాటిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.
{{/usCountry}}ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేబినెట్ తాజాగానే నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ…. వాటిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.
{{/usCountry}}ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని (రూరల్) స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో (అర్బన్) 33.13 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో…. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.
మరోవైపు 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు మంజూరు కావాలంటే పాలకవర్గం తప్పనిసరిగా కొలువుదీరి ఉండాలి. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగానే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.