రైతుల ఆదాయాలను పెంచడం, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాల(FPOs) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని ఎస్ఈఆర్పీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కడపలోని వీరబల్లి, తిరుపతిలోని యర్రవరిపాలెంలో విజయవంతమైన ప్రాసెసింగ్ కేంద్రాలను ఆదర్శంగా తీసుకుని SERP కింద ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ కార్యక్రమం రైతులను కేవలం పచ్చి మునగాకు అమ్మకానికే పరిమితం చేయకుండా.. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ నుండి బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు చైన్ సిస్టమ్‌లో పాలుపంచుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక వాతావరణం, సాగు విస్తీర్ణం, ముడి పదార్థాల లభ్యత, రైతుల ఆసక్తి, ఎఫ్‌పీఓల సామర్థ్యం ఆధారంగా యూనిట్లను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం తమిళనాడులోని పెరియకుళంలో ఉన్న ఉద్యానవన కళాశాల, పరిశోధనా సంస్థ నుండి అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను సేకరించి రైతులకు సరఫరా చేస్తుంది.
ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ పద్ధతులపై రైతులకు, ఎఫ్‌పీఓల ప్రతినిధులకు అవగాహన కల్పించడానికి అధ్యయన పర్యటనలు కూడా చేస్తారు. యర్రావరిపాలెంలోని ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ రోజుకు 250 కిలోల మునగ పొడిని ఉత్పత్తి చేస్తోంది. రూ. 86.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్, 300 ఎకరాల నుండి మునగ ఆకులను సేకరిస్తుంది.
ఒక కిలో మునగాకును ఉత్పత్తి చేయడానికి రైతులు రూ. 10 ఖర్చు చేస్తుండగా.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) వాటిని కిలో రూ. 15 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని, దీనివల్ల రైతులకు కిలోకు రూ. 5 లాభం లభిస్తోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన రైతులు ఎకరానికి రూ. 1.30 లక్షల వరకు అభివృద్ధి సహాయం పొందవచ్చు. మునగ సాగు ద్వారా రైతులకు నెలకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు నికర ఆదాయం లభించవచ్చని ఆయన తెలిపారు.
మునగాకు సాగుకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. వర్షాభావ, కరవు ప్రాంతాలలో కూడా ఈ పంట ఏపుగా పెరుగుతుంది. ఇతర సాంప్రదాయ పంటలతో పోలిస్తే తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉండటంతో పురుగుమందుల ఖర్చు దాదాపు ఉండదు. ఒక్కసారి నాటుకుంటే ఏళ్లకు ఏళ్లు క్రమం తప్పకుండా దిగుబడిని ఇస్తుంది.
{{/usCountry}}మునగాకు సాగుకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. వర్షాభావ, కరవు ప్రాంతాలలో కూడా ఈ పంట ఏపుగా పెరుగుతుంది. ఇతర సాంప్రదాయ పంటలతో పోలిస్తే తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉండటంతో పురుగుమందుల ఖర్చు దాదాపు ఉండదు. ఒక్కసారి నాటుకుంటే ఏళ్లకు ఏళ్లు క్రమం తప్పకుండా దిగుబడిని ఇస్తుంది.
{{/usCountry}}కేవలం పచ్చి ఆకును అమ్మడమే కాకుండా, సేకరించిన ఆకులను నీడన ఆరబెట్టి, పొడి చేసి విక్రయించడం ద్వారా రైతులు రెట్టింపు లాభాలు పొందుతున్నారు. స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ద్వారా విక్రయాలు జరుపుతుండటంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా మంచి ధర లభిస్తోంది.