ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం, ఆర్థిక నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు.

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం, కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కోరనున్నారు.
ఎల్ నీనో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, రైతులకు సాయం అందించేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లేదా సహాయం అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను అర్థించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగే భేటీలో గోదావరి నది నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, నదుల అనుసంధానం ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
వచ్చే ఏడాది కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు ఏర్పాట్లకు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక, లాజిస్టిక్ మద్దతును అందించాల్సిందిగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరనున్నారు.
రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం, నూతన రోడ్డు ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు.
పర్యటనలో భాగంగా గురువారం రోజున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించే భాగస్వామ్య సదస్సు ముందస్తు కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గురువారం అర్ధరాత్రికి సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.
{{/usCountry}}పర్యటనలో భాగంగా గురువారం రోజున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించే భాగస్వామ్య సదస్సు ముందస్తు కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గురువారం అర్ధరాత్రికి సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.
{{/usCountry}}