...
...
Next Story

ఏపీ జాబ్ క్యాలెండర్ - 2026 అప్డేట్ : 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - ఈ తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల

AP Job Calendar 2026: జాబ్ క్యాలెండర్-2026 అమలుకు ఏపీ సర్కార్ వేగం పెంచింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు.

Published on: Jul 30, 2026, 10:21:42 IST
Advertisement

AP Job Calendar 2026 : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ - 2026 అమలులో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీ జాబ్ క్యాలెండర్ - 2026... సర్కార్ కీలక నిర్ణయం
ఏపీ జాబ్ క్యాలెండర్ - 2026... సర్కార్ కీలక నిర్ణయం

జాబ్ క్యాలెండర్-2026 అమలుపై బుధవారం మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ శాఖల అవసరాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకుని పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు మంత్రుల బృందం వెల్లడించింది. వివాదాలకు తావు లేకుండా, ప్రతి ఏటా కచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దశలవారీగా నోటిఫికేషన్లు…

ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పక్కా ప్రణాళికతో నాలుగు దశలుగా విభజించారు. ఇప్పటికే మొదటి దశలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక రెండో దశకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 3,168 పోస్టుల భర్తీకి వచ్చే సెప్టెంబర్ 15న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అక్టోబర్‌లో ఒకేసారి రెండు నోటిఫికేషన్లు

మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమీక్షా సమావేశంలో మంత్రుల బృందంతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాఖల పనితీరు, తక్షణ అవసరాలకు తగినట్లుగా నియామకాలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe