Job Calender : ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్ తేదీలు, పోస్టుల వివరాలు

AP Job Calendar : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది కానుకగా ఏపీలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Published on: Mar 19, 2026, 08:58:02 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలు, నోటిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్రకటిస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెర‌వేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు.

జాబ్ క్యాలెండర్ విడుదల
జాబ్ క్యాలెండర్ విడుదల

'వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్రక‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాం. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.' అని నారా లోకేశ్ చెప్పారు.

ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రక‌ట‌న పండ‌గ ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తన మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిందని మరోసారి గుర్తుచేశారు. ఇక నిరుద్యోగులు పోటీప‌రీక్షల‌కు సిద్ధం అవ్వాలని సూచించారు. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు.

పోస్టుల వివరాలు

  • ఉన్నత విద్యలో 1500 పోస్టులు-నోటిఫికేషన్ తేదీ మే 15, 2026
  • గ్రూప్ 1- 91 పోస్టులు, హోమ్ శాఖ-2778, ఇతర శాఖలు-928- నోటిఫికేషన్ తేదీ ఆగస్టు 15, 2026
  • గ్రూప్ II-750 పోస్టులు, ఇంజినీరింగ్-503 పోస్టులు, ఇతర శాఖలు-506 పోస్టులు- నోటిఫికేషన్ తేదీ సెప్టెంబర్ 15, 2026
  • పాఠశాల/ఇంటర్ విద్యలో 3004 పోస్టులు- నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ 15,2026
  • మెుత్తం పోస్టులు-10,060
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More