Ugadi 2026: ఈరోజే ఉగాది.. కావాల్సిన పూజా సామాగ్రితో పాటు తప్పక పాటించాల్సిన ఆ ఏడింటినీ తెలుసుకోండి!
ఉగాది నాడు పిల్లాపాపలతో సంతోషంగా ఉగాది పచ్చడి తిని ఆనందంగా జరుపుకుంటాము. ఉగాది నాడు చాలా మంది కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది నాడు అంతా బాగా కలిసి రావాలని పూజ చేస్తారు, ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకుంటారు.
ఉగాది తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. ఉగాది నాడు పిల్లాపాపలతో సంతోషంగా ఉగాది పచ్చడి తిని ఆనందంగా జరుపుకుంటాము. ఉగాది నాడు చాలా మంది కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది నాడు అంతా బాగా కలిసి రావాలని పూజ చేస్తారు, ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకుంటారు. అయితే ఉగాది నాడు పూజ చేయడానికి కావలసిన సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ కోసం కావాల్సిన సామాగ్రి:
1.దేవుడి విగ్రహాలు:
దేవుడు విగ్రహాలను పెట్టి పూజిస్తాం కాబట్టి, ఇష్టదైవం విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టండి. కచ్చితంగా విఘ్నాలను తొలగించే వినాయకుని పూజించండి. వినాయకుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు.
2.అగరబత్తులు:
అగరబత్తులు స్వచ్ఛతను సూచిస్తాయి. అగరబత్తులను ఇంట్లో వెలిగిస్తే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
3.దీపారాధన సామాగ్రి:
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపాన్ని ఇంట్లో వెలిగించడం వలన చీకటి తొలగిపోయి వెలుగు ఏర్పడుతుంది. ఉగాదినాడు కచ్చితంగా దీపారాధన చేయాలి. దీపారాధనకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకోండి.
4.తాజా పువ్వులు:
పూజ చేయడానికి కావలసిన తాజా పూలను ఇంట్లోకి తీసుకురండి. తాజా పూలు స్వచ్ఛత, భక్తిని సూచిస్తాయి.
5.పసుపు, కుంకుమ:
పసుపు, కుంకుమలు శుభప్రదమైనవి. సంపద, సానుకూల శక్తిని సూచిస్తాయి.
6.తాజా పండ్లు:
నైవేద్యానికి కావాల్సిన పండ్లను ఇంటికి తెచ్చుకొని పూజ తర్వాత చివరగా నైవేద్యం పెట్టండి.
7.సాంబ్రాణి:
సాంబ్రాణి లేదా మంచి సువాసన వెదజల్లే డిఫ్యూసర్లు వంటివి వాడడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. తాజాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు.
ఉగాది నాడు సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ పద్ధతులను పాటించండి
అభ్యంగన స్నానం:
ఉగాది నాడు అభ్యంగన స్నానం చేయడం చాలా ముఖ్యం. తలస్నానం చేయడానికి ముందు తలకు నూనె రాసుకుని, ఒంటికి కూడా నూనె రాసుకుని స్నానం చేయాలి.
మామిడి ఆకుల తోరణం:
ఇంటికి మామిడి ఆకుల తోరణం కట్టడం వలన అదృష్టం, సంపద పెరుగుతాయి. అభివృద్ధిని చూస్తారు.
ఉగాది పచ్చడి:
ఉగాది పచ్చడి జీవితంలో కష్టసుఖాలను సమానంగా చూడాలని తెలుపుతుంది. ఉగాది నాడు కచ్చితంగా మర్చిపోకుండా ఉగాది పచ్చడిని తినండి.
ఇష్టదైవాన్ని పూజించండి:
ఉగాది నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ గదిలో తాజా పువ్వులను ఉపయోగించి అందంగా అలంకరించండి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయండి. విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తే డబ్బుకి లోటు ఉండదు.
పంచాంగ శ్రవణం:
ఉగాది నాడు పంచాంగ శ్రవణం వింటారు. భవిష్యత్తులో రాబోయే కష్టాలు, మంచి ఫలితాల గురించి తెలుసుకుంటారు.
ఇంటిని అందంగా అలంకరించడం:
ఉగాదికి ఇంటిని శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఆహారం, డబ్బు దానం చేయడం:
ఉగాది నాడు లేని వారికి దుస్తులు లేదా డబ్బులు వంటి వాటిని సహాయం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త తెలుగు సంవత్సరంలో అదృష్టం కూడా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


