Osmania University Job Mela 2026 : నిరుద్యోగులకు అలర్ట్ - ఓయూ క్యాంపస్ లో జాబ్ మేళా, తేదీ వివరాలివే
Osmania University Job Mela 2026: హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఈనెల 20వ తేదీన ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా నిర్వహించనున్నారు.100 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ మేళాను తలపెట్టారు. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు.

ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫార్మాసిస్ట్ పోస్టులకు బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి ఉండాలి. అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చేసినా అభ్యర్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు.
- 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- ఎంపికైన వారికి రూ.16,383నుంచి రూ.19,769వేల వరకు వేతనం ఉంటుంది. వీరంతా కూడా హైదరాబాద్ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.
- ఈ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 8247656356 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
- ఆసక్తిగల అభ్యర్థులు వారి విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో(UEI&GB /MCC ) కార్యాలయానికి వెళ్లాలి.
- మార్చి 20,2026 వ తేదీన ఈ జాబ్ మేళాను పూర్తి చేస్తారు.
ఇతర వివరాలు:
- తేదీ మరియు సమయం: 20.03.2026 ఉదయం 11:00 గంటలకు.
- వేదిక: యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
- తీసుకురావాల్సినవి: బయోడేటా (Resume) మరియు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు.
- సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 8247 656 356 ( T. రాము).
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

