Job Calendar 2026 AP : గెట్ రెడీ.. ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్.. 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు!
Job Calendar 2026 AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారీగా పోస్టులు గురించి వివరాలు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 10,000 పోస్టులు మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు సంబంధిత శాఖల్లో ఖాళీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రతిపాదిత పోస్టులు:
- పాఠశాల విద్య అండ్ ఇంటర్ – 3,000
- ఎస్సై అండ్ కానిస్టేబుళ్లు – 3,000
- విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు – 1,500
- ఏఈ పోస్టులు – 500
- సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు – 200
- అటవీశాఖ – 100
- స్టాటిస్టిక్స్ అధికారులు – 200
- గ్రూప్-1 – 100
- గ్రూప్-2 – 500
మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రణాళికలు వేస్తోంది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళికను పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
గతంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యల గురించి లోకేష్ మాట్లాడారు. గత సంవత్సరం జరిగిన డీఎస్సీ మాదిరిగానే ఉగాది జాబ్ క్యాలెండర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల నోటిఫికేషన్‌ను చేర్చాలని, నియామక ప్రక్రియలో ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేవని నిర్ధారించుకోవాలని లోకేష్ అన్నారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు.
స్కిల్ పోర్టల్ గురించి ప్రస్తావిస్తూ.. దాని ప్రారంభాన్ని వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. 25 రంగాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఇప్పటికే సిద్ధం అయ్యాయని, డేటా ఇంటిగ్రేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో 1,14,899 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 3,100 విదేశీ ఉద్యోగాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 16 మంది రిక్రూటర్లు ఆన్‌బోర్డ్‌లో ఉన్నారని, ట్రయల్ ప్రాతిపదికన ఉన్నారని వెల్లడించారు. 20,000 మందికి పైగా విద్యార్థులు, 60,000 మంది ఉద్యోగార్థులకు AI-ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












