TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు.. ఉగాది, శ్రీరామనవమికి
TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు జరగనున్నాయి. ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఈ ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి.
తెలుగు ఉగాది, శ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని ఈ మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారు. ప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

ఉగాది ఆస్థానం
మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా వేదపండితులు స్వామివారి సన్నిధిలో కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.
శ్రీరామనవమి ఆస్థానం
మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. దీనికి ముందు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. ఆస్థానం సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామ జనన ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.
పట్టాభిషేక ఆస్థానం
శ్రీరామనవమి తరువాతి రోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు తిరుమల ఆలయంలో పట్టాభిషేక ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.
దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం తప్పే
శ్రీవారి దర్శన క్యూలైన్‌లో రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్‌లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు.
ఇందుకుగాను టీటీడీ, శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు. కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












