Ugadi Kanya rasi Horoscope: ఉగాది నుంచి కన్యా రాశికి ఎలా ఉంటుంది? మార్చి నుంచి ఏప్రిల్ 2027 దాకా నెలల వారీగా ఫలితాలు!

Ugadi Kanya rasi Horoscope 2026: ఈ సంవత్సరం అన్ని రాశుల వారు తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది? ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? ఇటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Published on: Mar 14, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సంవత్సరం అన్ని రాశుల వారు తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది? ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? ఇటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Ugadi Kanya rasi Horoscope: ఉగాది నుంచి కన్యా రాశికి ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi Kanya rasi Horoscope: ఉగాది నుంచి కన్యా రాశికి ఎలా ఉంటుంది? (pinterest)

పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది?

గురువు ఈ ఏడాది జూన్ నుంచి 11వ స్థానంలో ఉండడంతో అనుకూలంగా ఉంటుంది. శని ఏడవ స్థానంలో సంచరించడం, రాహువు ఆరవ స్థానంలో మరియు కేతువు 12వ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది. ఈ ఏడాది కన్యా రాశి వారికి సమాజంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

ధన లాభం కూడా కలగవచ్చు. కన్యా రాశి వారి వ్యాపారంలో కూడా భారీగా లాభాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు ఈ ఏడాది చక్కటి సమయం అని చెప్పొచ్చు. అయితే లాభం వున్నా అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకుంటే ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.

వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి

కన్యా రాశి వారికి నూతన పెట్టుబడులు కూడా శుభ ఫలితాలను తీసుకువస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ఈ ఏడాది బాగా కలిసి రాబోతోంది. రైతులకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మీడియా రంగాల వారికి కూడా పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి. కన్యా రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని చూస్తారు. వైవాహిక స్థానంలో శని ప్రభావం ఉంది. దీంతో మానసిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టొచ్చు.

మిగతా గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండడంతో శుభ ఫలితాలే కలుగుతాయి. కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందడానికి వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం మంచిది. అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడా హర స్తోత్రాన్ని పఠిస్తే కూడా కన్యా రాశి వారికి బాగుంటుంది. దైవబలం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండడంతో మంచిగా ఉంటుంది. ఇక మాసవారీ ఫలితాలను కూడా చూద్దాం.

కన్యా రాశి వారికి ఏప్రిల్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఎలా ఉండబోతుంది?

మార్చి - ఏప్రిల్ 2026:

ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. లోన్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భర్తతో మాట పట్టింపులు రావచ్చు. ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతింటుంది.

మే 2026:

నెల కూడా మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో విరోధాలు, బంధుమిత్రులతో మాట పట్టింపులు వంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రాసిక్యూషన్ సమస్యలు కూడా రావచ్చు. సరిగ్గా టైమ్‌కు డబ్బు అందకపోవడం, తండ్రి ఆరోగ్యం దెబ్బతినడం, స్త్రీలకు రోగబాధలు వంటి సమస్యలు కనిపించవచ్చు.

జూన్ 2026:

ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకి బాగా కలిసి వస్తుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలుచేస్తారు. వాహన యోగం కూడా ఉంది. ధన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రమోషన్లు కూడా రావచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి.

జూలై 2026

ఈ నెలలో మీకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత దెబ్బ తినొచ్చు, ధన లాభం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఆగస్టు 2026:

ఈ నెలలో కూడా మీకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో సమస్యలు రావచ్చు. ధన లాభం కలుగుతుంది. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.

సెప్టెంబర్ 2026:

ఈ నెల మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆభరణ ప్రాప్తి స్త్రీలకు కలుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఊహించని ధనం చేతికి వస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నూతన స్త్రీ పరిచయాలు కలుగుతాయి.

అక్టోబర్ 2026:

ఈ నెలలో వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా బాగుంటుంది. స్త్రీలకు కుటుంబ వృద్ధి, ధన లాభం కలుగుతుంది. ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. కుటుంబ గౌరవాన్ని పెంచుతారు. శుభకార్యాలకు హాజరవుతారు.

నవంబర్ 2026:

ఈ నెల కూడా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. వాహన లాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు నవంబర్ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది.

డిసెంబర్ 2026:

ఈ నెల అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంది. దూర దేశ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం. అగ్ని ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

జనవరి 2027:

ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వస్తుంది. బాకీలను వసూలు చేస్తారు. ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనారోగ్య సూచనలు కూడా కనిపించవచ్చు. ధన లాభం కలుగుతుంది.

ఫిబ్రవరి 2027:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అన్ని విషయాల్లో బాగా కలిసి వస్తుంది.

మార్చి 2027 – ఏప్రిల్ 2027:

మీకు అంతగా అనుకూలంగా లేవు. స్త్రీ పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య చికాకులు పెరిగే అవకాశం ఉంది. ధన లాభం ఉన్నప్పటికీ కుటుంబంలో విరోధాలు రావచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే గౌరవ మర్యాదలు లభిస్తాయి. అధికారులతో సఖ్యత పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More