RRB Group D : రైల్వేలో 22,195 పోస్టులు.. అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​

RRB group d last day to apply : ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్​ డీ పోస్టులకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 09, 2026 6:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులు, రైల్వేలో ఉద్యోగం పొందాలని చూస్తున్న వారికి బిగ్​ అలర్ట్​! ఆర్​ఆర్బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు)కి సంబంధించిన గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో, అంటే మార్చ్​ 9, 2026తో ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారు అధికారిక వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

నిరుద్యోగులకు అలర్ట్​..
నిరుద్యోగులకు అలర్ట్​..

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ జనవరి 31న మొదలైంది. వాస్తవానికి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ ఈ మార్చ్​ 2తో ముగియాల్సి ఉంది. కానీ ఈ గడువును మార్చ్​ 9కి పొడిగించారు. మరి మరోసారి ఈ డెడ్​లైన్​ని ఎక్స్​టెండ్​ చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. అధికారిక ప్రకటన లేదు కాబట్టి, ఈరోజే చివరి ఛాన్స్​గా పరిగణించి, వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భాగంగా 22,195 గ్రూప్​ డీ పోస్టులను భర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- కీలక తేదీలు..

దరఖాస్తు కోసం చివరి తేదీ: మార్చ్​ 9, 2026 (రాత్రి 11:59 వరకు)

ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ: మార్చ్​ 11, 2026

దరఖాస్తు సవరణ విండో: మార్చ్​ 12 నుంచి మార్చ్​ 21, 2026 వరకు

స్క్రైబ్ వివరాల సమర్పణ: మార్చ్​ 22 నుంచి మార్చ్​ 26, 2026 వరకు

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- ఎలా రిజిస్టర్​ చేసుకోవాలి?

స్టెప్​ 1- అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in సందర్శించాల్సి ఉంటుంది.

స్టెప్​ 2- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్​) పూర్తి చేసుకోండి.

స్టెప్​ 3- మీకు కావాల్సిన ఆర్‌ఆర్బీ రీజియన్‌ను ఎంచుకుని వివరాలను ఎంటర్​ చేయండి.

స్టెప్​ 4- అవసరమైన డాక్యుమెంట్స్​ని అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.

స్టెప్​ 5- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్​ని డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- రిజిస్ట్రేషన్​ ఫీజు..

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, మాజీ సైనికులు, పీడబ్ల్యూబీడీ అండ్​ ఈబీసీ: రూ. 250 (పరీక్షకు హాజరైన తర్వాత ఈ మొత్తం పూర్తిగా రీఫండ్​ అవుతుంది).

ఇతర అభ్యర్థులు: రూ. 500 (పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ అవుతుంది).

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- సెలక్షన్​ ప్రాసెస్​..

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026లో భాగంగా అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)

శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)

డాక్యుమెంట్​ వెరిఫికేషన్​

వైద్య పరీక్షలు

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ని, అధికారిక నోటిఫికేషన్​ని సందర్శించాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More