ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్లు.. 24 గంటలూ ఓపెన్.. ఒక్క ఈ విమానాశ్రయంలో తప్ప!
రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాల్లో బార్‌లు, మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్క విమానాశ్రయం మినహా మిగతా ఎయిర్‌పోర్టుల్లో ఇవి ఏర్పాటు కానున్నాయ్.
ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలలో బార్లు, మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ నూతన విధానం నుండి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయానికి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్-II) ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా 'జీవో ఎంఎస్ నెం. 386' విడుదల చేశారు.

విమానాశ్రయ ప్రాంగణంలో బార్ లేదా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారులను సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
బార్ లైసెన్స్ కోసం ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ సిఫార్సు చేసిన అభ్యర్థులు రూ. 5 లక్షల నాన్-రిఫండబుల్ (తిరిగి ఇవ్వబడని) ఫీజుతో పాటు 'ఫామ్-1B' లో సంబంధిత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి 'ఫామ్-2B' ద్వారా బార్ లైసెన్స్ మంజూరు చేస్తారు.
మద్యం దుకాణాల కోసం ఆపరేటర్ సిఫార్సు చేసిన దరఖాస్తుదారులు రూ. 2 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజుతో 'ఫామ్ A-3(B)' లో దరఖాస్తు చేసుకోవాలి. ఎక్సైజ్ అధికారుల పరిశీలన తర్వాత లైసెన్స్ జారీ అవుతుంది.
ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌కు, సదరు లైసెన్స్ దారునికి మధ్య కుదిరిన ఒప్పందం (MoU) లేదా అగ్రిమెంట్ గడువు ముగిసే వరకు ఈ లైసెన్స్ అమలులో ఉంటుంది. విమానాశ్రయాల్లోని ప్రయాణికుల రద్దీ ఆధారంగా వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను నిర్ధారించారు.
సంవత్సరానికి 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులను నిర్వహించే విమానాశ్రయాలలో బార్‌ల కోసం వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును రూ. 25 లక్షలుగా, తక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న విమానాశ్రయాలలో రూ. 15 లక్షలుగా నిర్ణయించారు. మద్యం దుకాణాల కోసం వార్షిక పన్నును రూ. 1 కోటిగా నిర్ణయించారు. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఆధారంగా మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది.
విమానాశ్రయ కార్యాచరణ నియమావళి, భద్రతా నిబంధనలు, శాంతిభద్రతల అవసరాలకు లోబడి, బార్‌లు, మద్యం దుకాణాలు ఇరవై నాలుగు గంటలూ పనిచేయడానికి అనుమతిస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


