విశాఖ సీఐఐ సమ్మిట్.. ఏపీకి రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
విశాఖ సీఐఐ సదస్సు ద్వారా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ సదస్సులో 58 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల వ్యాపార దిగ్గజాలు పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు విశాఖపట్నం వేదికగా 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభం అవుతోంది. ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ. 11 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సదస్సు కోసం సాగరతీర నగరం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ భారీ పారిశ్రామిక సదస్సుకు సంబంధించిన వివరాలను పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల వ్యాపార దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఈ వేదికపై వివిధ రంగాలకు చెందిన దాదాపు 3,800 అవగాహనా ఒప్పందాలు (MoUs) కుదరనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేంద్రమంత్రి పియుష్ గోయల్ ఈ సదస్సులో పాల్గొంటారు.
'మారుతున్న కాలానికి అనుగుణంగా: సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం - నూతన ప్రపంచ వ్యవస్థలో ముందంజ (Navigating Change: Technology, Trust and Trade – Leading the Way in a New World Order)' అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు సాగనుంది.
ఈ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం కీలక నేతలు పాల్గొంటున్నారు. నవంబర్ 12న జరిగే సదస్సు ప్రారంభోత్సవం తర్వాత పారిశ్రామిక చర్చలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, స్పష్టమైన పాలనా దిశానిర్దేశం, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం టైలర్-మేడ్ ఇన్సెంటివ్‌లు, రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యాలను కల్పిస్తోంది.
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, గూగుల్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం శుభపరిణామమని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీటి వినియోగంపై వస్తున్న విమర్శలపై పల్లా స్పందిస్తూ.. ఏపీలో గ్రీన్ డేటా సెంటర్లు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. ఇవి తక్కువ విద్యుత్, పరిమితమైన నీటి వినియోగంతో పర్యావరణానికి హాని కలగకుండా పనిచేస్తాయని వివరించారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సీఐఐ సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక రంగానికి కూడా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


