విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించింది.

Published on: Dec 7, 2025, 16:37:35 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మిడ్ డే మిల్స్ స్కీమ్‌ను సెలవు రోజుల్లోనూ అందించనుంది. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి దాకా సెలవు రోజుల్లో సైతం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులకు హాజరు అయ్యే టెన్త్ విద్యార్థులకు రోజు వారీ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్ష కారణంగా ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరవుతారు. ఇటీవల పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయంలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. విద్యార్థులు ఆకలితో క్లాసులు వినాల్సి వస్తుందని కొంతమంది తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు మెుదలవుతాయి. ఏప్రిల్‌ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

పరీక్షల తేదీలు

మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 20, 2026 - ఇంగ్లీష్‌

మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)

మార్చి 25, 2026 – ఫిజిక్స్

మార్చి 28, 2026 – బయాలజీ

మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌

మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)

ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు

పరీక్ష ఫీజు

పరీక్ష ఫీజు తేదీ ఇప్పటికే మెుదలైంది. ప్రస్తుతం రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More