...
...
Next Story

గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లపై గుడ్‌న్యూస్: ఇక ఆ సర్టిఫికెట్లు అక్కర్లేదు.. పన్ను రశీదు ఉంటే చాలు!

గ్రామ కంఠాల్లోని నివాసాలు, వారసత్వంగా వచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గ్రామ కంఠంలోని భూములు నిషేధ జాబితాలో ఉన్నా.. ఇళ్లు, నివాస స్థలాలు ఉంటే.. నిర్దిష్ట డాక్యుమెంట్ల ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్ చేస్తారు.

Updated on: May 19, 2026, 08:46:18 IST
Advertisement

మీకు గ్రామకంఠం భూములు లేదా పాత ఇళ్లు ఉన్నాయా? వాటిని అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తూ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లు
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లు

ఇకపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. కేవలం పన్ను రశీదులు లేదా స్వయం ధ్రువీకరణ ఉంటే చాలు, మీ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది.

అసలు చిక్కు ఎక్కడ వచ్చింది?

గ్రామాల్లోని పాత నివాస ప్రాంతాలను సాధారణంగా గ్రామకంఠం భూములు అంటారు. వీటికి చాలా కాలంగా సరైన లింక్ డాక్యుమెంట్లు లేకపోవడం, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. పైగా ఈ సర్వే నంబర్లు పొరపాటున 22A (నిషేధిత ఆస్తుల జాబితా)లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వీటన్నింటికీ ప్రభుత్వం చెక్ పెట్టింది.

కొత్త రూల్స్ ఇవే

వెబ్‌లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లకు ఈ క్రింది మార్గదర్శకాలు వర్తిస్తాయి:

నిషేధిత జాబితాతో పనిలేదు: మీ స్థలం ఉన్న సర్వే నంబర్ వెబ్‌లాండ్‌లో 'గ్రామకంఠం' అని ఉంటే చాలు.. అది 22A నిషేధిత జాబితాలో ఉన్నా, లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.

ఇల్లు ఉండి.. డాక్యుమెంట్లు లేకపోతే: పాత ఇల్లు ఉండి, ఎలాంటి లింక్ దస్తావేజులు లేని పక్షంలో.. స్థానిక సంస్థలు (పంచాయితీ లేదా మున్సిపాలిటీ) జారీ చేసిన ఇంటిపన్ను రశీదు చూపిస్తే చాలు, అధికారులు రిజిస్ట్రేషన్ చేయాలి.

గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఉంటే (స్వయం ధ్రువీకరణ): పల్లెటూళ్లలో వంశపారంపర్య ఖాళీ స్థలాలకు ఎలాంటి కాగితాలు లేకపోతే, రిజిస్ట్రేషన్ పత్రంలోనే స్వయం ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది. తమకు వారసత్వంగా వచ్చిందని, తామే అనుభవిస్తున్నామని అందులో పేర్కొనాలి.

ఈ మార్పుతో ఎవరికి లాభం?

ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులపై హక్కులు లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో వాటిని అమ్ముకోవడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ముఖ్య గమనిక: గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ అధికారుల నుంచి విడిగా ఎలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని సబ్ రిజిస్ట్రార్లు ప్రజలను ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe