...
...
Next Story

APPCB : ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ప్రత్యేక డ్రైవ్!

APPCB : ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం ఉండేలా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లాన్ చేసింది. దశలవారీగా ప్రత్యేక డ్రైవ్‌లను విస్తరించనుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

Published on: Aug 19, 2026, 09:18:28 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఆవరణలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని (Green Cover) తప్పనిసరిగా నిర్వహించేలా చూడటానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా మొదటి విడత కింద ప్రతి జిల్లా నుండి ఒక పరిశ్రమ చొప్పున ఎంపిక చేసి 14 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.

పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం
పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం

జూలై 28 డ్రైవ్ ప్రారంభమై..ఆగస్టు 11న ముగిసింది. 26 జిల్లాల్లోని 26 పరిశ్రమ 43,300 మొక్కలు నాటారు. 129 ఎకరాల విస్తీర్ణం కవర్ చేశారు. ఈ డ్రైవ్‌లో ఎంపిక చేసిన అన్ని 26 పరిశ్రమలు కేటాయించిన 14 రోజుల గడువులోనే తమ పచ్చదనం లక్ష్యాలను విజయవంతంగా సాధించాయి.

ఈ కార్యక్రమంలో కేవలం సాధారణ మొక్కలు కాకుండా, స్థానిక వాతావరణానికి, నేల స్వభావానికి సరిపోయే రకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రావి, వేప, కానుగ, నేరేడు వంటి పర్యావరణ హిత వృక్షాలు నాటారు. వివిధ రకాల పండ్ల చెట్లు, అందాన్నిచ్చే అలంకరణ మొక్కలు పెట్టారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక కార్యక్రమ విజయంపై స్పందించారు. 'పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఒకదానికొకటి తోడుగా ముందుకు సాగాలి. పరిశ్రమల విస్తరణ ఎంత ముఖ్యమో, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కూడా అంతే అవసరం. 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను పరిశ్రమలు కచ్చితంగా పాటించాలి.' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో కూడా ఈ 33 శాతం పచ్చదనం నిబంధన అమలు జరిగేలా APPCB తదుపరి దశల్లో డ్రైవ్‌లను విస్తరించనుంది. తనిఖీలు కూడా చేయనుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించే పారిశ్రామిక యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe