రాష్ట్రంలో నకిలీ మద్యం నివారించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫేక్ లిక్కర్ నివారించేందుకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక మీదట ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా స్కాన్ చేయాల్సిందే. క్యూఆర్ కోడ్ స్కానింగ్ తర్వాతే దుకాణం, బార్ల యజమానులు అమ్మాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రతి దుకాణం, బార్ల దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ బోర్డులపై ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనది అని ధృవీకరించాం అని పెట్టాలి.
విక్రయించే ముందు, అమ్ముతున్న ప్రతీ మద్యం బాటిల్ మీద ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధలో పేర్కొంది ప్రభుత్వం. మద్యం బాటిల్ మీద సీల్, క్యాప్, హాలోగ్రామ్ స్థితి, ప్రామాణికతను చెక్ చేయాలి. ప్రతీ దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యునైనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్టర్‌లో అమ్మిన మద్యం బ్రాండ్స్, బ్యాచ్ నంబర్, రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అంతేకాదు క్యూఆర్ కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ రిజల్ట్‌ను కూడా ఎంటర్ చేయాలి.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైమ్ డేటాలో ప్రదర్శించాలి. ఎక్సైజ్ సిబ్బంది ప్రతి రోజూ మద్యం దుకాణం, బార్లలో ర్యాండమ్ విధానంలో చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత ఎక్సైజ్ అధికారి రోజూ సంతకం చేయాలి. మరో కీలక నిబంధన ఏంటంటే.. డిపో నుంచి వచ్చిన లిక్కర్ స్టాక్ అందిన వెంటనే ప్రతీ షాప్, బార్లో సరకులో నుంచి కనీసం 5 శాతం బాటిళ్లను స్కాన్ చేయాలి.
బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద లైసెన్స్ దారు సంతకం చేయాల్సి ఉంటుంది. తనిఖీల్లో నకిలీ మద్యం దొరికితే.. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారి, లైసెన్స్ దారుడు నకిలీ మద్యం మీద ఫిర్యాదు చేయకుంటే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా గుర్తించాలని ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద లైసెన్స్ దారు సంతకం చేయాల్సి ఉంటుంది. తనిఖీల్లో నకిలీ మద్యం దొరికితే.. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారి, లైసెన్స్ దారుడు నకిలీ మద్యం మీద ఫిర్యాదు చేయకుంటే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా గుర్తించాలని ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు.. ఫేక్ లిక్కర్ మీద ప్రజలు ఫిర్యాదు చేయడానికి 24 గంటలు పనిచేసే వ్యవస్థను తీసుకురావాలని తెలిపింది. ఇందుకోసం కంట్రోల్ రూం, వాట్సప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది.