ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ తియ్యటి కబురు అందించింది. సీపీఎస్ పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి(OPS) మారేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్‌పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు వన్ టైమ్ ఆప్షన్ కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 158ను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులతో పాటు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షనర్లు) కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఖరారు చేసింది.
2004 సెప్టెంబర్ 1 కంటే ముందే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైన ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. నియామక ప్రక్రియ/నోటిఫికేషన్ 2004 సెప్టెంబర్ 1కి ముందు వచ్చి, కొన్ని సాంకేతిక లేదా పరిపాలనా కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1 నాటికి లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఓపీఎస్‌కు మారేందుకు అర్హులుగా గుర్తింపు పొందారు.
ఆప్షన్ సమర్పణకు ఆఖరి తేదీ 2026 డిసెంబర్ 31గా నిర్ణయించారు. నిధి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మార్పు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పరిమిత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేసింది.
దరఖాస్తుదారులు తమ తొలి నియామక అధికారి నుంచి రైటింగ్ నోటిఫికేషన్ కాపీ, సెలక్షన్ లిస్ట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్, సర్వీస్‌లో చేరినట్లు తెలిపే జాయినింగ్ రిపోర్ట్ ధ్రువీకరించిన ప్రతి పొందాల్సి ఉంటుంది. ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న 15 పని దినాల్లోగా సంబంధిత నియామక అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా అందించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.
దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల పరిశీలన అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధి పోర్టల్ ద్వారా మాత్రమే డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఓపీఎస్ ఆప్షన్‌కు ఆమోదం లభించిన ఉద్యోగులను వెంటనే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సంబంధిత ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు. ఇప్పటివరకు సీపీఎస్ ఖాతాలో జమ అయిన ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి కొత్త జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు.
{{/usCountry}}దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల పరిశీలన అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధి పోర్టల్ ద్వారా మాత్రమే డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఓపీఎస్ ఆప్షన్‌కు ఆమోదం లభించిన ఉద్యోగులను వెంటనే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సంబంధిత ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు. ఇప్పటివరకు సీపీఎస్ ఖాతాలో జమ అయిన ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి కొత్త జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు.
{{/usCountry}}సీపీఎస్ కార్పస్ ఫండ్‌లోని ప్రభుత్వ కంట్రిబ్యూషన్, దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకే ఆర్థిక శాఖ మళ్లిస్తుంది. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, పెన్షన్ బెనిఫిట్లను త్వరితగతిన ఖరారు చేయాలని అన్ని శాఖల నియామక అధికారులను ఏపీ ఆర్థిక శాఖ ఆదేశించింది. అర్హులైన ఉద్యోగులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.