పబ్‌లో ఏపీ IAS అధికారి వీరంగం - మద్యం మత్తులో పోలీసులపై దూషణలు..!

IAS Officer Vikas Marmath Case : మద్యం మత్తులో పోలీసులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపీ ఐఏఎస్ అధికారి పీడీ వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. బెంగళూరులోని కావూర్ పబ్‌లో అర్ధరాత్రి ఈ ఘటన వెలుగు చూసింది.

Published on: Oct 13, 2026, 11:42:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి పొరుగు రాష్ట్రంలో మద్యం మత్తులో నానాయాగి చేశాడు. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పట్లే అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన 'కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో హంగామా చేయటం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ ఐఏఎస్ అధికారి పీడీ వికాస్ మర్మత్‌
ఏపీ ఐఏఎస్ అధికారి పీడీ వికాస్ మర్మత్‌

ఏం జరిగిందంటే..?

బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ‘కావూర్ పబ్’లో ఈ ఘటన చోటుచేసుకుంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌లో అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మత్తులో ఉన్నారు. తనిఖీలు చేయడానికి వచ్చిన కర్ణాటక పోలీసులను చూసి ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు.

విధుల్లో ఉన్న పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో దూషిస్తూ…. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గొడవను సర్దుమణిగేలా గురిచేసేందుకు పోలీసులు యత్నించినప్పటికీ…. తాను ఒక ఉన్నతాధికారిననే అహంకారంతో పోలీసులపైకే దాడికి యత్నించినట్లు సమాచారం.

కేసు నమోదు….

శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చిన పోలీసుల పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించి, వారి విధులకు తీవ్ర భంగం కలిగించిన వికాస్ మర్మత్ తీరుపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి యత్నించడం, అడ్డంకులు సృష్టించడం, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో వీరంగం వేయడం వంటి తీవ్ర ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

బాధ్యతాయుతమైన ఐఏఎస్ హోదాలో…. అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి అథారిటీ పీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఇలా ప్రవర్తించి క్రిమినల్ కేసు ఎదుర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More