Old Pension Scheme : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు ఓకే.. వన్ టైమ్ ఆప్షన్

CPS To OPS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఉద్యోగులను పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పి్స్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం డెడ్‌లైన్ పెట్టింది.

Published on: Nov 9, 2026, 17:44:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ తియ్యటి కబురు అందించింది. సీపీఎస్ పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి(OPS) మారేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్‌పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు వన్ టైమ్ ఆప్షన్ కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 158ను జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులతో పాటు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షనర్లు) కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఖరారు చేసింది.

2004 సెప్టెంబర్ 1 కంటే ముందే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైన ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. నియామక ప్రక్రియ/నోటిఫికేషన్ 2004 సెప్టెంబర్ 1కి ముందు వచ్చి, కొన్ని సాంకేతిక లేదా పరిపాలనా కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1 నాటికి లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఓపీఎస్‌కు మారేందుకు అర్హులుగా గుర్తింపు పొందారు.

ఆప్షన్ సమర్పణకు ఆఖరి తేదీ 2026 డిసెంబర్ 31గా నిర్ణయించారు. నిధి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మార్పు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పరిమిత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేసింది.

దరఖాస్తుదారులు తమ తొలి నియామక అధికారి నుంచి రైటింగ్ నోటిఫికేషన్ కాపీ, సెలక్షన్ లిస్ట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్, సర్వీస్‌లో చేరినట్లు తెలిపే జాయినింగ్ రిపోర్ట్ ధ్రువీకరించిన ప్రతి పొందాల్సి ఉంటుంది. ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న 15 పని దినాల్లోగా సంబంధిత నియామక అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా అందించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.

దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల పరిశీలన అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధి పోర్టల్ ద్వారా మాత్రమే డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఓపీఎస్ ఆప్షన్‌కు ఆమోదం లభించిన ఉద్యోగులను వెంటనే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సంబంధిత ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు. ఇప్పటివరకు సీపీఎస్ ఖాతాలో జమ అయిన ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి కొత్త జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు.

సీపీఎస్ కార్పస్ ఫండ్‌లోని ప్రభుత్వ కంట్రిబ్యూషన్, దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకే ఆర్థిక శాఖ మళ్లిస్తుంది. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, పెన్షన్ బెనిఫిట్లను త్వరితగతిన ఖరారు చేయాలని అన్ని శాఖల నియామక అధికారులను ఏపీ ఆర్థిక శాఖ ఆదేశించింది. అర్హులైన ఉద్యోగులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More