...
...
Next Story

'ఏపీలో రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్నీ ఏసీ బస్సులే.. ప్రతి ఇల్లూ విద్యుత్ ఉత్పత్తి చేయాలి'

APSRTC AC Buses : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్ల ఏపీఎస్ఆర్టీసీలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేదవాడు కూడా దర్జాగా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్నారు.

Published on: Apr 23, 2026, 14:30:15 IST
Advertisement

విడతల వారీగా ఆర్టీసీ బస్సులన్నీ త్వరలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రీన్ ఈవీ వాహనాలను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ కూడా 1,050 బస్సులను తీసుకువస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

ఏపీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

'రాబోయే రోజుల్లో క్రమంగా ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం. మీరందరూ సహకరించాలి. కేవలం డబ్బు ఉన్నవాళ్లే కాదు. పేదలు కూడా ఏసీలో తిరగాలి. అంతేకాదు ప్రతీ ఇల్లూ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కావాలి. అందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. 2019-24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణ లోపాలతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారని విమర్శించారు.

ఇప్పటికే 160 గిగావాట్లలో 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారీకు అనుమతులు మంజూరు చేశామన్నారు చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతోందన్నారు. వచ్చే ఏడాది ఈ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. 'త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. వెయ్యికిపై ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. మరో 444 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. మూడు సంవత్సరాలలో 5 వేలకుపైగా ఛార్జింగ్ స్టేషన్లు వస్తాయి.' అని చంద్రబాబు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe