ఇండియాలోకి Tesla Model Y L ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- 681 కి.మీ రేంజ్​తో! ధర ఎంతంటే..

Tesla in India : టెస్లా మోడల్​ వై ఇప్పుడు భారత మార్కెట్​లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మేరకు టెస్లా మోడల్​ వై ఎల్​ తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రేంజ్, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Apr 22, 2026, 10:43:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tesla Model Y L range : భారత్​లో సేల్స్​ పెంచుకునేందుకు శ్రమిస్తున్న దిగ్గజ అంతర్జాతీయ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. తాజాగా “మోడల్​ వై ఎల్”​ అనే ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న 'టెస్లా మోడల్​ వై'కి 6 సీటర్​ వర్షెన్​ అని చెప్పుకోవాలి. దీని ఎక్స్​షోరూం రూ. 61.99 లక్షలు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న టెస్లా మోడల్​ వై ప్రీమియం ఆర్​డబ్ల్యూడీ, లాంగ్ రేంజ్ ఆర్​డబ్ల్యూడీ వేరియంట్ల మధ్య ఇది కొనసాగనుంది.

టెస్లా మోడల్​ వై ఎల్​ లాంచ..
టెస్లా మోడల్​ వై ఎల్​ లాంచ..

టెస్లా మోడల్​ వై ఎల్​- పెరిగిన కొలతలు, అదనపు స్పేస్..

గతంలో ఉన్న ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మోడల్ కంటే ఈ ‘ఎల్’ (లాంగ్​ వీల్​బేస్) వేరియంట్ కొలతల్లో గణనీయమైన మార్పులు సంతరించుకుంది.

పొడవు: ఇది 4,976 ఎంఎం పొడవు కలిగి ఉండి, పాత మోడల్ కంటే 180 ఎంఎం ఎక్కువ.

వీల్‌బేస్: దీని వీల్‌బేస్ 150 ఎంఎం పెరిగి 3,040 ఎంఎంకి చేరింది. దీనివల్ల కారు లోపల మూడవ వరుస సీట్లను ఏర్పాటు చేయడం సాధ్యమైంది.

గ్రౌండ్ క్లియరెన్స్: సీట్ల సంఖ్య పెరగడంతో లోడ్ పడినప్పుడు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 16 ఎంఎం తగ్గి 122 ఎంఎంగా ఉంది.

టెస్లా మోడల్​ వై ఎల్​- ఇంటీరియర్, సీటింగ్ లేఅవుట్..

టెస్లా మోడల్​ వై ఎల్​ లగ్జరీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇప్పుడు 2+2+2 సీటింగ్ లేఅవుట్‌తో వస్తోంది.

రెండవ వరుస: ఇక్కడ పవర్ ఫోల్డింగ్, హీటింగ్ ఫంక్షన్‌తో కూడిన రిట్రాక్టబుల్ ఆర్మ్‌రెస్ట్ ఉంటుంది.

మూడవ వరుస: 50:50 స్ల్పిట్ సీట్లు, యూఎస్​బీ టైప్-సీ పోర్ట్‌లు, కప్ హోల్డర్లు, ప్రత్యేకంగా ఏసీ వెంట్లు ఉన్నాయి.

స్టోరేజ్: రెండు, మూడు వరుసల సీట్లను మడతపెడితే ఏకంగా 2,539 లీటర్ల కార్గో స్పేస్ లభిస్తుంది. అదనంగా కారు ముందు భాగంలో 116 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది!

టెస్లా మోడల్​ వై ఎల్​- పవర్, రేంజ్..

ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ పర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొడుతోంది.

"డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తున్న టెస్లా మోడల్​ వై ఎల్​, కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 201 కి.మీగా నిర్ణయించారు," అని సంస్థ తెలిపింది.

సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 681 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్​టీపీ రేంజ్) ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, ఇందులో ఉన్న బై-డైరెక్షనల్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా ఈ-బైకులు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

టెస్లా మోడల్​ వై ఎల్​- కలర్​ ఆప్షన్స్​..

టెస్లా మోడల్​ వై ఎల్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 19 ఇంచ్ మెషినా 2.0 అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి. ఇంటీరియర్​కి స్టాండర్డ్​గా బ్లాక్ ఫినిషింగ్​ వస్తుంది. జెన్​ గ్రే కలర్​ కావాలనుకుంటే అదనంగా రూ. 95వేలు చెల్లించాలి. ఇక ఎక్స్​టీరియర్​లో ఈ ఈవీ 6 కలర్​ ఆప్షన్స్​తో వస్తుంది. స్టెల్త్ గ్రే కలర్​ స్టాండర్డ్​. పర్ల్​ వైట్​ మల్టీ కోట్​, డైమండ్​ బ్లాక్​ వంటి రంగులు కావాలనుకుంటే రూ. 95వేలు అదనంగా చెల్లించాలి. గ్లేషియర్ బ్లూ, అల్ట్రా రెడ్​, కాస్మిక్​ సిల్వర్ కావాలనుకుంటే రూ. 1.85లక్షలు ఎక్స్​ట్రా కట్టాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. టెస్లా మోడల్​ వై ఎల్ వేరియంట్ ధర ఎంత?

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61.99 లక్షలు.

2. ఈ కొత్త మోడల్ రేంజ్ ఎంత?

సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 681 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టెస్లా వెల్లడించింది.

3. సీటింగ్ లేఅవుట్ ఎలా ఉంటుంది?

ఇది ఆరు సీట్ల (6-seater) వేరియంట్. ఇందులో 2+2+2 లేఅవుట్ ఉంటుంది, అంటే రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు అందుబాటులో ఉంటాయి.

4. ఇందులో ఏవైనా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయా?

వెహికల్-టు-లోడ్ ఫీచర్ ద్వారా ఇతర గృహోపకరణాలు లేదా ఈ-బైకులను ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మూడవ వరుస సీట్ల కోసం ప్రత్యేకంగా ఏసీ వెంట్లు మరియు ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More