ఆంధ్రప్రదేశ్ నుంచి లూనార్ మిషన్‌కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ మిషన్ శక్తి శాట్‌కు ఎంపికైంది. ఆమెను మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన మిషన్ శక్తి శాట్(Mission Shakti SAT) కు తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక ఏపీ బాలికగా జెస్సీ చరిత్ర సృష్టించింది.

ఈ గ్లోబల్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా, పలు విడతల కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల తుది జాబితాలో 14 ఏళ్ల జెస్సీ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
జెస్సీ తండ్రి వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జెస్సీ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారాల్సి వచ్చింది. అయితే ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు సైన్స్ రరంగంలో ఆమెను ప్రోత్సహించారు.
జెస్సీ భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ ఛార్జ్ మణిమాల జెస్సీకి ఉన్న సైన్స్ పట్ల ఆసక్తిని గుర్తించి మిషన్ శక్తి శాట్‌కు దరఖాస్తు చేయించారు. పాఠశాలకు చెందిన మరో ఎనిమిది మంది విద్యార్థులతో కలిసి దరఖాస్తు చేయగా అప్పటికే ఆన్‌లైన్ కోర్సు ప్రారంభమైనప్పటికీ నిర్వాహకులను సంప్రదించి వారికి అవకాశం కల్పించారు.
పాఠశాల వేళల తర్వాత అంతరిక్ష సాంకేతికతపై ఆన్‌లైన్ శిక్షణ పొందుతూ జెస్సీ పదో తరగతి చదువును సమతుల్యం చేసుకుంది. మొత్తం 21 మాడ్యూళ్లలో ఉన్న 550 సెషన్లలో ఇప్పటికే 50 నుండి 60 శాతం వరకు కోర్సును పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఉపగ్రహ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి అధునాతన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ లెర్నింగ్, శాస్త్రవేత్తలతో ఇంగ్లీషులో గంటపాటు జరిగిన ఇంటర్వ్యూ, మిషన్ శక్తి శాట్ ప్రాముఖ్యతను వివరిస్తూ సమర్పించిన ఒక నిమిషం వీడియో ఆధారంగా జెస్సీ ఎంపికైంది.
ఈ ఘనత సాధించిన జెస్సీని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమానికి ఎంపికైన ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిగా ఇటువంటి ప్రాజెక్ట్‌కు ఎంపికవుతానని ఊహించలేదని జెస్సీ ఆనందం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని, తన తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
జెస్సీ తదుపరి విడత శిక్షణ కోసం ఆగస్టు 23 నుంచి న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా శాస్త్రవేత్తలతో కలిసి శాటిలైట్ డిజైన్, పేలోడ్ డెవలప్‌మెంట్, మిషన్ ఆపరేషన్లలో ఆమె ప్రత్యక్ష ప్రాక్టికల్ శిక్షణ పొందనుంది. అలాగే జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననుంది. ఈ ప్రాజెక్ట్ కింద ఎంపికైన విద్యార్థినులు రూపొందిస్తున్న లూనార్ క్యూబ్‌శాట్‌ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


