Summer Safety Guidelines : సమ్మర్ సేఫ్టీ గైడ్‌లైన్స్‌పై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కీలక ఆదేశాలు
Summer Safety Guidelines : రాబోయే వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. పిల్లలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. సుమారు 48 రోజులు విద్యార్థులకు హాలీడేస్ ఉంటాయి. ఏప్రిల్ 23వ తేదీ స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు బయట తిరగడం, ఎండలో ఇబ్బందిపడటంలాంటివి జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వేసవి సెలవులు నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ ఇచ్చింది. వడ దెబ్బ, వడగాలుల ప్రభావం, నదులు, చెరువులు, కాలువల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అన్ని స్కూళ్లల్లో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, విద్యార్థులు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ చెప్పింది. వడదెబ్బ నివారణపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో పాల్గొనాలని మార్గదర్శకాలు ఇచ్చింది..
కాలువలు, చెరువులు, నదులు వంటి జలాశయాల సమీపంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని విద్యాశాఖ నొక్కి చెప్పింది. పెద్దల పర్యవేక్షణ లేకుండా ఈ ప్రదేశాలను సందర్శించవద్దని, అలాగే తెలియని నీటు కుంటలు, చెరువుల్లో ఈత కొట్టవద్దని విద్యార్థులకు సూచించారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు స్వయంగా రక్షించుకోవడానికి ప్రయత్నించకుండా, పెద్దలను అప్రమత్తం చేయాలి.
అదేవిధంగా పాఠశాలలు కౌన్సెలింగ్‌లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని, క్రీడలు, పఠనం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలని విద్యాశాఖ తెలిపింది. అలాగే ఫోన్, టీవీల స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించాలని సూచనలు చేసింది. భద్రతా సూచనలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలి, జలాశయాల సమీపంలో ఉన్న పాఠశాలలు మరింత అప్రమత్తతతో ఉండాలని తెలిపింది.
జిల్లా, మండల విద్యాధికారుల ద్వారా పర్యవేక్షణను ముమ్మరం చేయడంతో పాటు సెలవులు ప్రారంభమయ్యేలోపు విద్యార్థుల కౌన్సెలింగ్ సెషన్‌లన్నీ పూర్తి చేయాలి. ఈ చర్యలను అమలు చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ శాఖ హెచ్చరించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


