...
...
Next Story

ఫ్యామిలీకి రూ.78000.. మే నాటికి 2 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌లు టార్గెట్!

ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు జనాలను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది.

Published on: Jan 22, 2026, 10:12:26 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఫీడర్ సోలారైజేషన్, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల సంసిద్ధత, పర్యవేక్షణను నిర్ధారించాలని, ఈ పథకం అమలు, దీర్ఘకాలిక పనితీరును నిర్ధారించాలని APSPDCLను ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు.

సోలార్ రూఫ్‌టాప్‌లు (Unsplash)
సోలార్ రూఫ్‌టాప్‌లు (Unsplash)

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, సోలార్ రూఫ్‌టాప్, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జవాబుదారీతనంతో వేగంగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. వీటికి సంబంధించి భూసేకరణ, లీజు రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్, ప్రాజెక్టు అమలును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

సోలార్ రూఫ్‌టాప్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చూస్తోంది. జనాలు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే.. వేగవంతమైన ఆమోదాల కోసం విధానాలను సరళీకరించనుంది. మెరుగైన సేవలను అందించనుంది. మార్చి 2026 నాటికి 1.5 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను, మిగిలిన వాటిని మే 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా మీటర్లను అమర్చాలని ఫీల్డ్ ఆఫీసర్లను సీఎస్ ఆదేశించారు. లోపాలకు డివిజనల్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లను బాధ్యతలు వహించాలన్నారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పథకంలో భాగంగా రూ.78000 వరకు సబ్సిడీ అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలును ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు అమ్ముకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks