AP Thalliki Vandanam Scheme : తల్లికి వందనం స్కీమ్ - రేపటి నుంచే ఖాతాల్లోకి నగదు, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
AP Govt Thalliki Vandanam : తల్లికి వందనం స్కీమ్ నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున నిధులు జమమవుతాయి.
AP Govt Thalliki Vandanam : రాష్ట్రంలోని పేద విద్యార్థుల తల్లులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే నిధుల పంపిణీ ప్రక్రియ రేపటి నుంచి (జూలై 22) అధికారికంగా షురూ కానుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ ఆర్థిక సాయం జూలై 22 నుంచి జూలై 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు దశలవారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డిబిటి (DBT) పద్ధతి ద్వారా చేరనుంది. ఈ ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూరనుంది.
తల్లికి వందనం స్కీమ్ - స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లాలి.
- ఆధార్ నెంబర్, స్కీమ్ టైప్(తల్లికి వందనం) , సెలెక్ట్ ఇయర్ ఉంటుంది.
- ఆధార్ ఉన్న చోట మీ విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- తర్వాత 2026-27 సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
- పక్కనే ఉన్న డిటేల్స్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- దాన్ని స్కీన్‌పై కనిపిస్తున్న చోట ఎంటర్ చేయాలి.
- తర్వాత దాని కింద కనిపించే క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- వెంటనే స్క్రీన్‌పై మీ స్కీమ్ వివరాలు కనిపిస్తాయి.
ఆన్‌లైన్‌లో మీకు వెతుక్కోవడం ఇబ్బందిగా ఉంటే…. మీ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్‌ను అడిగితే మీకు సంబంధించిన వివరాలు చెబుతారు.
నకిలీ లింకులతో జాగ్రత్త!
తల్లికి వందనం పథకం నిధుల పంపిణీ వేళ సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని… వారి నకిలీ లింకుల పట్ల లబ్ధిదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
"మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడాలంటే వెంటనే ఈ లింక్‌పై క్లిక్ చేయండి" లేదా "వెంటనే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేయండి" అంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద ఫేక్ మెసేజ్‌లను ఎంతమాత్రం నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అటువంటి లింకులపై క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్ము మొత్తం సైబర్ దొంగల పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఏటీఎం పిన్ (ATM PIN), ఆధార్ నంబర్, ముఖ్యంగా మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయకూడదు.
- సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ (SMS) ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి లింకులపైనా క్లిక్ చేయకూడదు.
- పథకం నిధుల జమకు సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా కంగారు పడాల్సిన అవసరం లేదు.
- నిధులు రాకపోతే నేరుగా మీ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని గానీ, లేదా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను గానీ కలిసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

