WhatsApp Username : వాట్సాప్​లో అదిరిపోయే 'యూజర్​నేమ్' ఫీచర్- మీ పేరు ఇప్పుడే రిజర్వ్​ చేసుకోండి..

WhatsApp username reservation : వాట్సాప్ యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు వెల్లడించకుండా చాట్ చేసుకునే సరికొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను మెటా సంస్థ పరిచయం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రానున్న ఈ అప్‌డేట్‌కు ముందే, యూజర్లు తమకు నచ్చిన ప్రత్యేకమైన హ్యాండిల్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు!  ఎలా అంటే..

Published on: Jun 30, 2026, 09:59:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది1 ఇప్పటివరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, గ్రూప్‌లో యాడ్ అవ్వాలన్నా ఫోన్ నంబర్ షేర్ చేయడం తప్పనిసరిగా ఉండేది. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా కేవలం ఒక 'యూజర్‌నేమ్' ద్వారా అవతలి వారితో కనెక్ట్ అయ్యే సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ అద్భుతమైన ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే ముందే.. యూజర్లు తమకు నచ్చిన, యూనిక్ యూజర్‌నేమ్‌ను ముందుగానే బుక్ (రిజర్వ్) చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వాట్సాప్ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో వాట్సాప్ ప్రకటించింది.

వాట్సాప్​లో యూజర్​నేమ్ ఫీచర్.. ఏంటిది?
వాట్సాప్​లో యూజర్​నేమ్ ఫీచర్.. ఏంటిది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 300 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇంతమంది రేసులో ఉన్నప్పుడు మనకు నచ్చిన పేరుతో యూజర్‌నేమ్ దొరకడం కష్టం కాబట్టి, ఈ ముందస్తు రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఇక రాబోయే కొద్ది నెలల్లో ఈ వాట్సాప్ యూజర్​నేమ్ ఫీచర్ దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ కానుంది.

వాట్సాప్ యూజర్‌నేమ్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి?

మీ మొబైల్‌లోని వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.

యాప్ ఓపెన్ చేసి Settings > Account > Username విభాగంలోకి వెళ్లండి.

ఈ ఫీచర్ మీ అకౌంట్‌కు అందుబాటులోకి వస్తే అక్కడ మీకు నచ్చిన యూజర్‌నేమ్‌ను టైప్ చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో ఈ సదుపాయం యాక్టివేట్ అవ్వగానే యాప్‌లోనే ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది.

ఒకవేళ మీరు అనుకున్న యూజర్‌నేమ్ అప్పటికే ఎవరైనా తీసేసుకుంటే.. వాట్సాప్ ఇన్‌బిల్ట్ యూజర్‌నేమ్ జనరేటర్ ద్వారా ప్రత్యామ్నాయంగా ఉండే కొన్ని పేర్లను మీకు సూచిస్తుంది.

ప్రైవసీకి పెద్ద పీట.. స్పామ్ మెసేజ్‌లకు చెక్!

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (ట్విట్టర్) లాగా వాట్సాప్‌లో అందరి యూజర్‌నేమ్‌లను వెతికేందుకు ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ లేదా సెర్చ్ ఆప్షన్ ఉండదు. అంటే, మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ అవతలి వ్యక్తికి తెలిస్తేనే వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు.

"అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే స్పామ్, వేధింపుల మెసేజ్‌లను అరికట్టడానికి, యూజర్ల వ్యక్తిగత వివరాలకు మరింత రక్షణ కల్పించడానికే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాము," అని మెటా యాజమాన్యం పేర్కొంది.

దీనికి అదనపు రక్షణగా వాట్సాప్ ఒక ఆప్షనల్ ‘యూజర్‌నేమ్ కీ’ని కూడా ప్రవేశపెడుతోంది. దీని ద్వారా మీ యూజర్‌నేమ్ తెలిసినా కూడా, మీ అనుమతి (వెరిఫికేషన్) ఉంటేనే కొత్తవారు మీతో సంభాషణను ప్రారంభించగలరు.

క్రియేటర్లు, బిజినెస్‌లకు ఊరట!

ఆన్‌లైన్‌లో ఇప్పటికే బ్రాండ్ నేమ్ సంపాదించుకున్న క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్లకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. అర్హులైన యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో ఉన్న సేమ్ యూజర్‌నేమ్‌ను ఇక్కడ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. దీనివల్ల మెటా ప్లాట్‌ఫామ్స్ అన్నింటిపై ఒకే విధమైన బ్రాండింగ్‌ను కొనసాగించడం సులువవుతుంది.

అయితే, ఈ యూజర్‌నేమ్ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. పాత పద్ధతిలోనే తమ ఫోన్ నంబర్ ద్వారా వాట్సాప్ ఉపయోగించాలనుకునే వారు ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా యాప్‌ను వాడుకోవచ్చు. ఈ సరికొత్త అప్‌డేట్ క్రమంగా భారత దేశ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More