ఏపీ గురుకుల ఎక్సలెన్స్ సెంటర్లలో అడ్మిషన్స్.. ఇంటర్‌లో ఫ్రీగా ఐఐటీ, నీట్ కోచింగ్
ఎక్స్‌లెన్స్ సెంటర్లలో అడ్మిషన్ల కోసం సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సెంటర్లలో ఇంటర్మీడియట్‌తోపాటుగా జేఈఈ, నీట్‌లకు ఉచితంగా శిక్షణ ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) ప్రతిభావంతులైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ తమ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులతో పాటు ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) ఉచిత శిక్షణలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఏపీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు.

విశాఖపట్నంలోని మేఘాద్రిగెడ్డ, గుంటూరు జిల్లాలోని అమరావతి-తాడికొండ, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కోట ప్రాంతాల్లో ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఈ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (జూనియర్ ఇంటర్), రెండో సంవత్సరం (సీనియర్ ఇంటర్) MPC, BiPCలో అడ్మిషన్స్ ఉన్నాయి.
మొదటి సంవత్సరంలో మార్చి 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కనీసం 85 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రెండో సంవత్సరం కోసం మార్చి 2026 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో(ఎంపీసీ/బైపీసీ) 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇతర జూనియర్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు కూడా ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఇంటర్ విద్యతో పాటు ఉచితంగా ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తారు.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత హాస్టల్ సదుపాయం ఉంటుంది. ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తారు. ఉచితంగా ప్రామాణికమైన పుస్తకాలు, పరీక్షల మెటీరియల్ ఇస్తారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 75 శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు కేటాయించగా, మిగిలిన 25 శాతం సీట్లను ఓసీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు కేటాయించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారిక అడ్మిషన్ల పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు
జూలై 17 నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 30 వరకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సెంటర్లలో కార్పొరేట్ విద్యను పొందవచ్చు. జేఈఈ, నీట్‌లపై ఫోకస్ చేసే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


