ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో బాలల గేయ రచన పోటీలు.. దరఖాస్తుల ఆహ్వానం!

పిల్లల కోసం బాలల గేయ రచన పోటీలకు ఆంధ్ర సారస్వత పరిషత్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.

Published on: Jul 21, 2026, 18:19:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భాషాభిమానులకు, రచయితలకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక మంచి అవకాశాన్ని ముందుకు తెచ్చింది. చిన్నారులను అలరించేలా, వారిలో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేలా ‘బాలల గేయ రచన’ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు కోలాహలంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకలను పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన సాహితీ పోటీకి శ్రీకారం చుట్టారు.

ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఆంధ్ర సారస్వత పరిషత్తు

తెలుగు భాషా వికాసానికి, బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఈ పోటీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ గేయ రచన పోటీలలో పాల్గొనడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. సాహిత్యాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు.

మీరు రాసే బాలల గేయం గరిష్టంగా 15 పంక్తులకు (లైన్లకు) మించకుండా ఉండాలి. తెలుగు భాషా వికాసం, మన సంస్కృతీ సాంప్రదాయాలు, భారతీయుల జీవన విధానం, దేశభక్తి వంటి అంశాలపై పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేలా రచనలు రూపుదిద్దుకోవాలి.

పూర్తిచేసిన గేయం రాతప్రతిని పీడీఎఫ్ రూపంలోకి మార్చేసి ఆగస్టు 10వ తేదీలోగా 9866995085 అనే వాట్సప్ నంబరుకు పంపించాల్సి ఉంటుంది.

పోటీలలో ప్రతిభ చూపిన ఉత్తమ గేయాలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు సత్కారాలు ఉంటాయని సంస్థ కార్యదర్శి ధవేజీ, ముఖ్య సమన్వయకర్తలు డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కోగంటి శ్రీకాంత్‌లు తెలియజేశారు.

ప్రథమ బహుమతి: రూ. 3,000

ద్వితీయ బహుమతి: రూ. 2,000

తృతీయ బహుమతి: రూ. 1,000

ప్రోత్సాహక బహుమతులు: 10 మందికి రూ. 500 చొప్పున అందజేస్తారు.

విజేతలకు నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను డిసెంబర్‌లో జరిగే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఘనంగా అందజేస్తారు. ఈ పోటీలో ఎంపికైన అత్యుత్తమ గేయాలకు ఆడియో రికార్డింగ్ చేసి, వాటిని అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా దృశ్య రూపాలుగా (AI Videos) మారుస్తారు. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.

తెలుగు భాషా సంస్కృతులను భావి తరాలకు అందించే ఈ బృహత్తర క్రతువులో రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలకు తెలుగు భాషపై మక్కువ పెరిగేలా గేయ రచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More