...
...
Next Story

అవయవదాత కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం.. ప్రభుత్వానికి మంత్రి విజ్ఞప్తి!

అవయవదాత కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. ఆర్థిక నేపథ్యం ఆధారంగా కుటుంబంలోని అర్హత కలిగిన సభ్యునికి మద్దతుగా తాత్కాలిక ఉపాధిని కూడా అందించవచ్చన్నారు.

Published on: Jan 5, 2026, 10:03:40 IST
Advertisement

అవయవ దాత కుటుంబానికి రూ.1 లక్ష సహాయం అందించాలని మంత్రి సత్యకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటువంటి కుటుంబాలు చేసిన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో ఇటువంటి సహాయం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పునిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా అవయవ దానాన్ని ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు.

మంత్రి సత్యకుమార్
మంత్రి సత్యకుమార్

అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ రూ.లక్ష చొప్పున అందజేయాలని ప్రభుత్వానికి మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. 2025లో ఏపీలో రికార్డు స్థాయిలో 301 అవయవ మార్పిడిలు జరిగాయని, 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల నుండి వీటిని సేకరించామని అన్నారు. వీరిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఇటీవలి నెలల్లో అవయవ దానం రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు.

ఆగస్టు 8, 2024న జీఓ-95 జారీ చేసిన తర్వాత దాతల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించబడుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లు లేదా సీనియర్ అధికారులు అంత్యక్రియలకు హాజరవుతున్నారన్నారు. 'జీవన్ దాన్ కార్యక్రమం కింద, దాతల కుటుంబాలకు రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం.' అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

అవయవదానం చేసిన వారి ఆర్థిక నేపథ్యం ఆధారంగా కుటుంబంలోని అర్హత కలిగిన సభ్యునికి మద్దతుగా తాత్కాలిక ఉపాధిని కూడా అందించవచ్చని ప్రభుత్వానికి సత్యకుమార్ ప్రతిపాదించారు.

గత దశాబ్దంలో అవయవ దానాల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 2015లో 91గా ఉన్న అవయవాల సంఖ్య 2024లో 210కి పెరిగింది, 2025 రికార్డులో మరింత ఎక్కువైంది. ముఖ్యంగా 2020 నుండి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 69 మంది యువ దాతలు ఈ ప్రయత్నంలో భాగం కావడం గొప్ప విషయం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe