...
...
Next Story

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు - నవంబర్ 10 వరకు దరఖాస్తులకు ఛాన్స్

AP High Court Civil Judge Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 26, 2026, 13:20:46 IST
Advertisement

AP High Court Civil Judge Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు :

  • మొత్తం భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య: 119
  • పోస్టు పేరు: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీ, ప్రొసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అనుభవం ఉండాలి.
  • 01.09.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మరియు మాజీ సైనిక ఉద్యోగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ప్రారంభ వేతన శ్రేణి అందుబాటులో ఉంటుంది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

3 పద్ధతుల ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. ఇందులో అర్హత సాధిస్తే… మెయిన్స్ కు ఎంపికవుతారు. వీరికి ఆపై ఇంటర్వ్యూలను ఎంపిక చేస్తారు.

  1. స్క్రీనింగ్ టెస్ట్ : మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత (CBT) మల్టిపుల్ ఛాయిస్ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారి నుంచి ఒక పోస్టుకు పది మంది చొప్పున (1:10 నిష్పత్తిలో) తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
  2. రాత పరీక్ష: ద్వితీయ దశలో రాత పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
  3. మౌఖిక పరీక్ష : రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో 50 మార్కులకు నిర్వహించే మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)కు పిలుస్తారు. ఈ మూడు దశల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఓసీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు రూ.750గా నిర్ణయించారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in/recruitments.php లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks