ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. కీలక ఆదేశాలు.. టైమ్‌లైన్ విడుదల!

ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకో టైమ్‌లైన్ కూడా ప్రకటించింది. నిర్ణయిత గడువులోపు స్కీనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Published on: Jun 18, 2026, 06:02:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్య భద్రత, ప్రత్యేక అవసరాల గుర్తింపు దిశగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ (Prashast 2.0) మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను(Disabilities) ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ అప్‌గ్రేడెడ్ యాప్‌ను ఉపయోగించనున్నారు.

విద్యార్థులకు దివ్యాంగ స్క్రీనింగ్
విద్యార్థులకు దివ్యాంగ స్క్రీనింగ్

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనిద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ముందస్తుగానే గుర్తించి, వారికి తగిన విద్యాపరమైన మద్దతు, వైద్య సహాయం అందించడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

‘ప్రశస్త్ 2.0’ యాప్‌ను యుడైస్ ప్లస్ (UDISE+) తో అనుసంధానించడం వల్ల స్క్రీనింగ్, పర్యవేక్షణ, గుర్తింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మారుతుందని ఎస్పీడీ వివరించారు. తమ పాఠశాలల్లో నమోదైన ఏ ఒక్క విద్యార్థి కూడా మిస్ అవ్వకుండా, 100 శాతం స్క్రీనింగ్ పూర్తి చేసేలా ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

కీలక మార్గదర్శకాలు

అన్ని రకాల పాఠశాల యాజమాన్యాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ఐఈఆర్‌పీలు వెంటనే ప్రశస్త్ యాప్‌లో రిజిస్ట్రేషన్, యాక్టివేషన్ పూర్తి చేయాలి.

క్లాస్ టీచర్లు అందరూ తమ తరగతిలోని ప్రతి విద్యార్థికి 'పార్ట్-1' స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలి. ఈ ఫలితాల ఆధారంగా, అవసరమైన చోట స్పెషల్ ఎడ్యుకేటర్లు, భవిత కేంద్రాల సిబ్బంది యాప్ నిబంధనల ప్రకారం 'పార్ట్-2' స్క్రీనింగ్‌ను నిర్వహిస్తారు.

యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించడంపై ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములకు జిల్లా స్థాయిలో అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.

టైమ్‌లైన్

స్క్రీనింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి ఎస్పీడీ శ్రీనివాసరావు ఒక నిర్దిష్టమైన టైమ్‌లైన్‌ను ప్రకటించారు. జూన్ - జూలైలోపు హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ ద్వారా ఇన్స్టిట్యూషనల్/అడ్మిన్ లాగిన్‌ల సృష్టి, యాక్టివేషన్ చేయాలి. ఆగస్టు వరకు క్లాస్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేటర్ల ద్వారా మ్యాపింగ్, అసైన్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి. సెప్టెంబరు వరకు సాధారణ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులందరికీ 'పార్ట్-1' స్క్రీనింగ్ పూర్తి చేయించాలి. అక్టోబరు వరకు అవసరమైన విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేటర్ల ద్వారా 'పార్ట్-2' స్క్రీనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

ఈ వినూత్న కార్యక్రమం ద్వారా అంగవైకల్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను సకాలంలో గుర్తించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన పునాది వేయవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More