గాదె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసు : విచారణ సీబీఐకి అప్పగింత - ఏపీ హైకోర్టు ఆదేశాలు

Gade Sai Krishna custodial death Case : విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ (25 అనుమానాస్పద మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published on: Oct 16, 2026, 21:34:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gade Sai Krishna custodial death Case : విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) శుక్రవారం కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ కేసు సమగ్ర విచారణ బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

అసలేం జరిగింది….?

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, అనంతరం ఆయ న అదృశ్యమయ్యారనే ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి, ఆరోపణల నడుమ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూన్ 21న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ - SIT) ఏర్పాటు చేసింది.

కేసును వేగవంతం చేసిన సిట్ అధికారులు, ఈ వ్యవహారానికి సంబంధించి తమ దర్యాప్తును పూర్తి చేసి 2026 సెప్టెంబర్ నెలలో న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

అయితే ఈ ఘటనలో నిజా నిజాలు పూర్తిగా వెలుగులోకి రావాలని, స్వతంత్ర సంస్థ ద్వారా సమగ్ర విచారణ జరగాలని భావించిన ఏపీ హైకోర్టు…. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. కస్టడీ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు, అధికారుల పాత్రను సమగ్రంగా వెలికితీయాలని కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై బాధితుని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More