విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక పూజలు
విజయవాడ కనక దుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రికి వచ్చిన రాష్ట్రపతి కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ పాలకమండలి తరఫున ఘనస్వాగతం లభించింది.

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా గాంధీ, ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా స్వాగతం పలికారు.
స్వాగత సత్కారాల అనంతరం రాష్ట్రపతి ఆలయ అంతరాలయంలోకి వెళ్ళి శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దేశ శ్రేయస్సు, ప్రజల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపించారు. దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, దివ్య ఆశీర్వచనాలతో రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి రాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి కొండపైన, కొండ కింద ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ మళ్లింపులు, పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.
'విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పండితులు రాష్ట్రపతికి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాలను సమర్పించారు.' అని హోంమంత్రి అనిత సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


