...
...
Next Story

AP IIIT Counselling 2026 : నేటి నుంచి ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే..!

AP IIIT Counselling Documents : ఏపీలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. సీటు సాధించిన విద్యార్థులు హాజరయ్యే సమయంలో వెంట తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jun 19, 2026 12:06 PM IST
Advertisement

AP IIIT Counselling Documents 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. నేటి నుంచి ట్రిపుల్ ఐటీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న విద్యార్థులకు నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్

ఈ విద్యాసంవత్సరానికి గానూ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి కేటాయించిన డిప్రెవేషన్ స్కోర్‌ను కలుపుతూ ఈ మెరిట్ జాబితాను సిద్ధం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలు… సమయాల ప్రకారం కౌన్సెలింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలన కోసం అడిగే ముఖ్యమైన పత్రాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

విద్యార్థుల వద్ద ఉండాల్సిన పత్రాలు :

  • అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న కౌన్సెలింగ్ ప్రవేశ పత్రం (Call Letter).
  • టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్‌షీట్ లేదా ఇంటర్నెట్ కాపీ.
  • పదో తరగతి పరీక్షల హాల్ టికెట్.
  • 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలల స్టడీ సర్టిఫికెట్లు (స్థానికత నిర్ధారణ కోసం).
  • రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులు (BC, SC, ST) మీసేవ ద్వారా పొందిన తాజా క్యాస్ట్ సర్టిఫికెట్.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తాజా ఇన్‌కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డ్.
  • ఓసీ అభ్యర్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు తాజా EWS సర్టిఫికెట్ సమర్పించాలి.
  • పీహెచ్ (PH), క్యాప్ (CAP), ఎన్‌సీసీ (NCC), స్పోర్ట్స్ కోటా ఉన్నవారు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు.
  • ద్యార్థి ఆధార్ కార్డ్ ఒరిజినల్ మరియు జిరాక్స్.
  • అభ్యర్థికి సంబంధించిన తాజా పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోలు (కనీసం 6 ప్రతులు).

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe