AP Inter Hall Tickets 2026 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల - డౌన్‌లోడ్ లింక్, పూర్తి వివరాలు ఇవే
AP Inter Supplementary Hall Tickets 2026 : ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. బోర్డు అధికారిక వెబ్‌సైట్ లేదా 'మన మిత్ర' వాట్సప్ నంబర్ ద్వారా వీటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు.
AP Inter Supplementary Hall Tickets 2026 : ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఈ వివరాలను వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ మార్గాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
విద్యార్థుల సౌకర్యార్థం, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈసారి హాల్‌టికెట్లను బోర్డు అధికారిక వెబ్ పోర్టల్(https://bie.ap.gov.in/ )తో పాటు వాట్సాప్ వేదికగా కూడా అందుబాటులోకి తెచ్చారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లోనే హాల్‌టికెట్‌ను సులువుగా పొందే వీలుంది.
ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు
ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇంటర్నెట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టం చేశారు. డిజిటల్ హాల్‌టికెట్‌ను నేరుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లవచ్చని, పరీక్షా కేంద్రాల్లోని అధికారులు దీనిని నిరభ్యంతరంగా అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు, రాసే సబ్జెక్టుల కోడ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కళాశాల యాజమాన్యాన్ని లేదా బోర్డు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
మే 21 నుంచి పరీక్షలు…
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

