ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా బోర్డు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు తెలియజేసింది. రాష్ట్రంలో జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీఎస్, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు మొదలైన వాటి ప్రిన్సిపాల్స్‌కు ఈ కాలంలో తమ కళాశాలల వారీగా టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

అన్ని కళాశాలల యాజమాన్యాలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలోని తమ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ప్రాంతీయ తనిఖీ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు, జిల్లా వృత్తి విద్యా అధికారులందరికి తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ విద్యార్థులకు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. అంటే.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి క్లాసులు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్‌ను విడుదల చేసింది.
ఈ అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మెుత్తం 232 రోజులు జూనియర్ కాలేజీలు పని చేస్తాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై ఇంటర్ బోర్డు కొన్ని నిబంధనలు పెట్టింది. పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారంటీపై ప్రచారం చేయకూడని స్పష్టం చేసింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని చెప్పడమే కాకుండా.. కాలేజీల నడుమ అనారోగ్యకరమైన పోటీని సృష్టించేలా ఉంటుందని అధికారులు చెప్పారు.
నిబంధనల ప్రకారం జూనియర్ కళాశాలలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాల పంపిణీ, గోడల మీద రాతలు వంటి చేయకూడదు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి, సీబీఎస్ఈ విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల తర్వాత కూడా ఏప్రిల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ప్లాన్ చేసింది ఇంటర్ బోర్డు.
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
- జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం
- అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు
- దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 20 వరకు
- హాఫ్ ఇయర్లీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు
- జనవరి 9 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
- జనవరి 19 నుంచి 23 వరకు ప్రీఫైనల్ పరీక్షలు
- ఫిబ్రవరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు
- ఫిబ్రవరి లేదా మార్చిలో థియరీ పబ్లిక్ పరీక్షలు
- 2026-27 అకడమిక్ ఇయర్ చివరి వర్కింగ్ డే మార్చి 18