...
...
Next Story

AP Inter Hall Ticket 2026 : ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి

Published on: Feb 13, 2026 11:24 AM IST
Advertisement

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు.

ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్

ఇంటర్ హాల్ టికెట్లు (image source istock)
ఇంటర్ హాల్ టికెట్లు (image source istock)

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సులభంగా వీటిని పొందే అవకాశం ఉంది.

ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక హాల్‌ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్‌ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

  1. ముందుగా https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఐపీఈ హాల్ టికెట్ లింక్ క్లిక్ చేయాలి.
  3. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ లేదా ఆధార్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
  4. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  5. డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.

మనమిత్ర వాట్సాప్ నెంబర్ నుంచి ఇలా…

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఇంటర్ హాల్ టికెట్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe